ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం 2018 – ముఖ్యమంత్రి యువ నేస్తం దరఖాస్తు ప్రక్రియ మొదలు

0

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం 2018 – ముఖ్యమంత్రి యువ నేస్తం దరఖాస్తు ప్రక్రియ మొదలు: ఏపి యువ నాంది పథకం. ఆంధ్రప్రదేశ్ యువనేస్తం పథకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యావంతులైన నిరుద్యోగ యువతకు చేయూతగా నిలేచే పథకం ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం 2018 దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అర్హులైన ప్రతీ నిరుద్యోగ యువత (ఆంధ్రప్రదేశ్) దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తు, ప్రక్రియ,  అర్హతలు, మరియు పథక ఉద్దేశ్యం తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం 2018 / ఆంధ్రప్రదేశ్ యువనేస్తం పథకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కొరకు అర్హులైన అభ్యర్థులనుండి దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. దీనికోసం ప్రభుత్వం అధికారిక వెబ్ సైట్ ను రూపొందించింది.

ఈ పథకం కింద రాష్ట్రంలో ఉన్న దాదాపు 12 లక్షల నిరుద్యోగులు (గతంలో నిర్వహించిన ప్రజా సాధికార సర్వే ప్రకారం ) లబ్ది పొందే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం 2018 – పథక ఉద్దేశ్యం

ఈ పథకం తప్పనిసరిగా నిరుద్యోగ యువతపై భారాన్ని తగ్గిస్తుంది మరియు వారికి త్వరగా ఉద్యోగం పొందటానికి సహాయం చేస్తుంది. యువతకు ఉద్యోగ అవకాశాలు , మంచి నైపుణ్యాలు గల శిక్షణ పొందటానికి ఈ పథకం ఆర్థికంగా సహాయం చేస్తుంది.

ఈ పథకం విద్యావంతులైన నిరుద్యోగ యువత యొక్క నైపుణ్యాలను మెరుగుపర్చడానికి, వారిని ఉద్యోగులుగా, పోటీదారులను మరియు పరిశ్రమ యొక్క అంచనాలను అధిగమించడానికి అదే విధంగా, వారిని పెట్టుబడిదారులుగా మార్చడానికి రూపొందించబడింది.

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం 2018 – ఎవరు అర్హులు

  • దరఖాస్తుదారులు నిరుద్యోగులై ఉండాలి మరియు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు అయి ఉండాలి.
  • కనీస విద్యార్హత గ్రాడ్యుయేషన్ (డిగ్రీ )/పాలిటెక్నిక్ పూర్తి చేసి ఉండాలి.
  • అభ్యర్థి 22-35 సంవత్సరాల వయస్సు ఉండాలి.
  • దారిద్య్రరేఖకు దిగువ ఉన్న కుటుంబానికి చెందిఉండాలి. ఒకే కుటుంబానికి చెందిన ఎందరైన నిరుద్యోగులు అర్హులు.
  • వాహనాలు కలిగిన వారు అనర్హులు.
  • 2.5 ఎకరాల బంజరు భూములు , గరిష్టంగా 5.00 ఎకరాల బీడు భూమిని కలిగిన వారు అర్హులు.
  • పబ్లిక్ / ప్రైవేట్ సెక్టార్ / ప్రభుత్వ అనుబంధ లేదా స్వయం ఉపాధి కలిగిన వారు అనర్హులు.
  • దరఖాస్తుదారు ఏదైన ప్రభుత్వ సేవ నుండి తొలగించిబడిన ఉద్యోగి అయి ఉండకూడదు.
  • అభ్యర్థి ఏ క్రిమినల్ కేసు లోను దోషి అయి ఉండకూడదు.
  • ప్రస్తుతం ప్రావిడెంట్‌ ఫండ్‌ పరిధిలోకి వచ్చిన వారు ఈ పథకానికి అర్హులు కారు.

ముఖ్యమంత్రి యువనేస్తం 2018 – ఎంత భృతి, ఎలా చెల్లిస్తారు

దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులకు ప్రతీ నెల మొదటి వారంలో నేరు వారి బ్యాంకు ఖాతా లో రూ.1,000/- జమ చేస్తారు. నమోదు ప్రక్రియ ముగిసిన 15 రోజుల తర్వాత బ్యాంకు ఖాతాల్లో భృతి జమ అవుతుంది.

ముఖ్యమంత్రి – యువనేస్తం పూర్తి వివరాలు

పథకం: ముఖ్యమంత్రి – యువనేస్తం

రాష్ట్రం: ఆంధ్రప్రదేశ్

అర్హులు: నిరుద్యోగ 22-35 సంవత్సరాల అభ్యర్థి

విద్యార్హత: డిగ్రీ/పాలిటెక్నిక్ పూర్తి

భృతి: రూ.1,000/-

నమోదు ప్రక్రియ ప్రారంభ తేది: 12/08/2018

అభ్యర్థుల సంఖ్య: 12 లక్షలు

ఇక్కడ నమోదు చేసుకోండి